03-11-2025 05:55:12 PM
వెంకటాపురం/నూగూరు (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీకొని 19 మంది మృతిచెందిన ఘటన చాలా బాధాకరం అని భారతీయ జనతా పార్టీ పండుగ ప్రధాన కార్యదర్శి సాధనపల్లి విజయ్ కుమార్ అన్నారు. మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారని, ఆ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు చికిత్స, ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంపై పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంమే వహించాలని, తక్షణమే విచారణ జరిపించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.