calender_icon.png 4 November, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాఘవేంద్ర పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

03-11-2025 05:49:11 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో 1996-97లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కృష్ణ గార్డెన్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరు చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రులందరు పరస్పరం ఆలింగణం చేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధురాను భూతులను నెమరు వేసుకున్నారు.

ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాద్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం అనంతరం బాల్య మిత్రులు కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేనిదన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్య క్రమంలో అప్పటి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శంకర్, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, భారతి, కుమార్, శ్రీదేవి, సత్య, మధు, సాగర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థికి ఘన సన్మానం

శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా 1996- 97 బ్యాచ్ పూర్వ విద్యార్థి నేరెళ్ళ వెంకటేష్ ఆటో కార్మిక సమితి ని స్థాపించి తద్వార సమాజ సేవ కార్యక్రమాలు కొనసాగి స్తుండటం పట్ల ఉపాధ్యాయు లు ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థి సమాజ సేవకు కృషి చేయడం పట్ల వారు హర్ష వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడాలని కోరారు.