calender_icon.png 4 November, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

03-11-2025 05:52:02 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలకు రైతులు పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ లు అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకాల్వల గ్రామంలోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు ప్రారంభోత్సవానికి  ప్రకాష్ రావు, అన్నయ్య గౌడ్  లు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆరుగలం కష్టపడి పండించిన పత్తిని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తేమ శాతం లేకుండా పత్తిని తీసుకురావాలన్నారు. అనంతరం అన్నయ్య గౌడు, ప్రకాష్ రావులను జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సుల్తానాబాద్ ఏవో పైడితల్లి, కార్యదర్శి మనోహర్, నాయకులు. జయపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పన్నాల రాములు, ఎరుకొండ తిరుపతి, పన్నాల తిరుపతి, ఏరుకొండ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసి సిబ్బంది, రైతులు పలువురు ఉన్నారు.