calender_icon.png 4 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది యావత్ మహిళల విజయం..

03-11-2025 06:01:02 PM

టీమిండియా గెలుపుపై బీఆర్ఎస్ మహిళల సంబరాలు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మహిళా టీమిండియా జట్టు మొట్టమొదటిసారి వరల్డ్ కప్ విజేతగా నిలవడంపై బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, మహిళ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టు విజేతగా రాణించడంపై సంతోషం వ్యక్తంగా ఉందని బీఆర్ఎస్ మహిళ పట్టణ అధ్యక్షురాలు స్వరూప రాణి అన్నారు.

నేడు మహిళా క్రికెట్ జట్టు ఎంతో స్ఫూర్తివంతమైన క్రీడాను ప్రదర్శించి మహిళా విశ్వవిజేత నిలిచి నేటి మహిళా సమాజానికి ఎంతో స్ఫూర్తివంతంగా నిలిచారన్నారు. ఇలాగే ప్రతి మహిళలు ఎన్ని రంగాలలో ముందుకు వస్తూ ప్రతిభను చాటాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు సైతం అమ్మాయిలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ భారత దేశం గర్వపడే స్థాయిలో అండగా నిలవడం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా మహిళలు క్రికెట్ ని ఆస్వాదిస్తూ పలు క్రికెట్ క్లబ్బులలో శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడగం మమత, పర్వీన్, కరుణ, తులసి, తదితరులు పాల్గొన్నారు.