calender_icon.png 29 August, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల జాబితా సవరణను వాయిదా వేయండి

29-08-2025 05:20:58 AM

ఎన్నికల కమిషన్‌కు బీఆర్‌ఎస్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో స్థానిక ఓటర్ల జాబితా  సవరణను తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రజలు, తమ ఓటరు జాబితాలోని వివరలాను సరి చూసుకోలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డాక్టర్ శ్రావణ్ దాసోజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గురువారం  ఇచ్చిన లేఖలో పేర్కొ న్నారు.   

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా గ్రామ పంచాయతీ కార్యాలయాలు నీళ్లలో మునిగిపోయాయని, దీంతో ప్రజలు పూర్తి స్థాయిలో పాల్గొనే పరిస్థితి లేదని తెలిపారు. పారదర్శక వాతావ రణంలో మరోసారి జాబితా ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను బీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఎడతెరిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రా ద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరం గల్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు వరద గుప్పిట్లో ఉన్నాయని వివరించారు.