calender_icon.png 20 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ వాయిదా వేయండి

19-12-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కొమురయ్య వినతి 

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే టెట్‌ను వా యిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఈ మేరకు ఆయన గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల్ ఇంచార్జ్ డైరెక్టర్ దేవసేనకు ఎమ్మెల్సీ కొమురయ్య లేఖలు రాశారు. గత 20 రోజులుగా టీచర్లు పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్నారని, వారు టెట్ పరీక్షకు సన్న ద్ధం కావడానికి తగిన సమయం దొరకలేదన్నారు. ఉపాధ్యాయుల ప్రయో జనాలు, విద్యా వ్యవస్థ పటిష్టత కోసం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.