11-10-2025 01:41:32 AM
మెదక్ ఏడీఈ మోహన్ బాబు
మెదక్, అక్టోబర్ 10:ప్రజలకు మరింత నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్లలో మరమ్మతులు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్, కరెంట్ తీగల మార్పులతో పాటు ట్రీ కటింగ్ తదితర పనులు చేపట్టనున్న దృష్ట్యా జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంతో పాటు మెదక్, హవేళీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శనివారం,
ఆదివారం రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ విద్యుత్తు శాఖ ఏడీఈ మోహన్‌బాబు, మెదక్ పట్టణ, హవేళీ ఘనపూర్ మండల ఏఈ నవీన్, మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల ఏఈలు రాజ్‌కుమార్, దినకర్, నర్సింలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.