calender_icon.png 12 October, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

11-10-2025 01:42:22 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మీటర్ మార్పిడి కో సం ఓ వినియోగదారుడి నుంచి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు. బాధితుడి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు. లాలాగూడ విద్యుత్ సబ్-డివిజన్ పరిధిలో ఓ కాంట్రాక్టర్, తాను చేపట్టిన విద్యుత్ పనులకు సంబం ధించి సింగిల్ ఫేజ్ మీటర్‌ను త్రీ ఫేజ్ మీటర్‌గా మార్చాలని, అదేవిధంగా ఆ ప్రాంతంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూ రు చేయాలని స్థానిక ఏఈ భూమిరెడ్డి సుధాకర్‌రెడ్డిని ఆశ్రయించారు.

ఏఈ రూ.15వేలు లంచంగా డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి న ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఏఈ సుధాకర్‌రెడ్డి బాధితుడి నుంచి రూ.15వే లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

చొప్పదండిలో పట్టుబడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి

చొప్పదండి(విజయక్రాంతి): గంగాధర మండలం మధురానగర్ గ్రామ కార్యదర్శి లబ్దిదారు నుంచి లంచం డిమాండ్ చేసి శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. మధురాన గర్ గ్రామానికి చెందిన గంగాధర శ్రీకాంత్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా బిల్లు మంజూరు కోసం గ్రామ కార్యదర్శి అనిల్ 10 వేల రూపాయలు డిమాండ్ చేయగా, శ్రీకాంత్ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో లంచం తీసుకుంటుండగా గ్రామ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.