calender_icon.png 25 July, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌రావు

24-07-2025 01:20:14 AM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేధిస్తున్నదని పిటిషన్ దాఖలు

ఆగస్టు 5న  పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం?

హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 23(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టీమ్ విచారణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ సమాచా రం.

ప్రభాకర్ రావు తన పిటిషన్‌లో సిట్ అధికారులు తరచూ విచారణకు పిలుస్తూ గంటల తరబడి కార్యాలయంలో ఉంచుతున్నారని, అవసరం లేకపోయినప్పటికీ పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసిం ది. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా కూడా అనవసరంగా ఇబ్బం ది పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా, ప్రభాకర్ రావు అరెస్టుపై ఆగస్టు 5వ తేదీ వరకు సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఈ ఆదేశాలతోనే ఆయనకు తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, సిట్ మాత్రం ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఒకసారి ఢిల్లీకి వెళ్లివచ్చిన సిట్ అధికారులు, ఆగస్టు 5న తదుపరి విచారణకు సంబంధించి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

విచారణకు సహకరించట్లేదు

ప్రభాకర్‌రావు విచారణకు సహకరించట్లేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. జ్యూ డీషియల్ కస్టడీతోనే ప్రభాకర్ రావు నోటి నుంచి వాస్తవాలు బయటికి రప్పించవచ్చని అధికారులు బలంగా వాదిస్తున్నారు. ఈ వి షయమై వారు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజా నికి, ఇటు సిట్ అధికారులు కాని, అటు ప్ర భాకర్ రావు కాని బహిరంగంగా ఎక్కడా ఈ విషయాలపై వ్యాఖ్యలు చేయడం లేదు.

అయితే కేసు పురోగతి, ఇరువర్గాల వాదనలు ‘లీకుల’ ద్వారా మీడియాలో ప్రచారమయ్యే లా చూస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నా రు. ఆగస్టు 5న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది.