calender_icon.png 25 July, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

24-07-2025 01:19:12 AM

- ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్

- హాజరైన ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీ ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ ఓబీసీ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలన్నారు. బీసీలకు ప్రత్యక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే మెజారిటీ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి డిమాండ్లు సాధించుకుంటామని తెలిపారు. అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిథ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణమని సూచించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో మోస్తరుగానైనా రిజర్వేషన్లు కల్పించారని, కానీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. రాజ్యాంగ రచన సమయం లోనే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, కానీ కల్పించకుండా అన్యాయం చేశారని అన్నారు.

ఇప్పటివరకు 121 సార్లు రాజ్యాంగ సవరణలు చేసినా రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించడానికి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేద న్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మల్లు రవి,  పాకాల సత్యనారాయణ,  బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ సీనియ ర్ నేత వి. హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, బోను దుర్గా నరేశ్ యాదవ్, కర్రి వేణు మాధవ్, తంగెళ్లమూడి నందగోపాల్‌లు పాల్గొన్నారు.