04-07-2025 08:26:46 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరు సింగిల్ విండోలొ దీర్ఘ కాళికా రుణాలు వసులల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు గాను ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో అవార్డు వారించింది. అవార్డు రావడంతో చైర్మన్ ప్రభాకర్ రావు ను టిఆర్ఎస్ నాయకులు సన్మానించారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ సొసైటీలోi దీర్ఘకాలిక రుణాలు వసూలు చేయడం సింగిల్ విండోను లాభాల బాటలోకి తెచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ఈ విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ ప్రభాకర్ రావు ను శుక్రవారం సన్మానించారు. అంతేకాకుండా కార్యదర్శికి వారి సిబ్బందికి పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా సింగిల్ విండోను లాభాల బాటలో నడిపిస్తూ మరింత మంది రైతులకు మేలు చేయాలని ఆకాంక్షించారు.