04-07-2025 08:24:29 PM
జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి) మున్నూరు కాపు కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అధ్యక్షుడి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు కులస్తులు విద్యతో పాటు రాజకీయంగా ముందుకు రావాలన్నారు. ఐక్యమత్యంగా ఉంటూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మండల మున్నూరు కాపు సంఘానికి తన అండ ఉంటుందని ఆయన తెలిపారు. మున్నూరు కాపులకు ఏ సమస్య వచ్చిన ముందుకు వచ్చి పరిష్కారం జరిగే వరకు కృషి చేద్దామని తెలిపారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గాదె తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని 33 గ్రామాలకు చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యులు ఎల్లారెడ్డి మండల కేంద్రం లోని ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడిగా గాదె తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మండల మున్నూరు కాపు సంగం అధ్యక్షుడిగా ఎన్నికైన, గాదే తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా కుల సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు.