calender_icon.png 5 July, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి...

04-07-2025 08:32:24 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సమాజంలో ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించగలుగుతామని అందుకు మొదటి దశ బాల్య దశేనని ఎన్నారై జీడి అభినయ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన సూర్యాపేట మాజీ జడ్పిటిసి జీడి బిక్షం కుమారుడు ఎన్నారై జీడి అభినయ్ కుమార్ శుక్రవారం తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ లో 150మంది విద్యార్థులకు సుమారు రూ.10వేల విలువగల నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు.తన తాత గ్రామ మాజీ సర్పంచ్ జీడి అంజయ్య ఆశయ సాధన కోసం ఎన్నారైగా తాను గ్రామానికి సేవలు అందించేందుకు సంకల్పంతో ఉన్నానన్నారు.