21-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీ శ్యామ్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు టీ జీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31న ప్రస్తుత టీజీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణ పదవీ విరమ ణ పొందుతున్న నేపథ్యంలో ఆ పదవిలో టీజీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్‌ను ఎన్నుకున్నట్టు వెల్లడించారు. శ్యామ్ మా ట్లాడుతూ.. సం ఘం అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.