calender_icon.png 21 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నుపోటుదారుడికి మద్దతిస్తావా?

21-12-2025 12:58:09 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుపై 

మండిపడ్డ దళిత దంపతులు

పెద్దపల్లి, డిసెంబరు 20 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో దళిత దంపతులు గోస్క రాజేశం, సుజాత.. ఎమ్మెల్యే విజయ రమణారావుపై నిప్పులు చెరిగారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమకు  సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వెన్నుపో టుదారునికి  మద్దతు తెలుపుతూ ఆ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే పాటుపడ్డాడని ఆవేద న వ్యక్తం చేశారు.

దీంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన గోస్కే రాజేశం, సుజాత దంపతులు గ్రామస్థులతో కలసి శనివారం గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్త తన రక్తంతో సోనియా గాంధీ, రాహు ల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేశారు. దళితులను ఎమ్మెల్యే చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి కైనా ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.