calender_icon.png 24 January, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

24-01-2026 12:00:00 AM

గట్టు, జనవరి 23: గట్టు మండలం బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులను గట్టు పోలీసులు ముందస్తుగా అరెస్టు చే సి స్టేషన్కు తరలించారు. గద్వాల నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జీ బాధ్యు లు బాసు హనుమంతు నాయుడు ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మద్దతుగా హైదరాబాద్ తరలి వెళుతున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాముడు వెంకటేశు, కృష్ణ ,రవి, తిమ్మప్ప ఆంజనేయులు తదితరులు ఉన్నారు.