23-09-2025 12:33:43 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం GST తగ్గింపు పై హర్షిస్తూ వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేసి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఫ్లెక్సీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓకే దేశం ఒకే పన్ను కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ ని ప్రవేశ పెట్టడం జరిగింది దేశ ప్రజలకు మోడీ పండగ కానుకగా జిఎస్టి తగ్గింపు ఇచ్చారని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని దాని వలన దేశం ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. వాహన రంగాలలో ఎలక్ట్రానిక్స్ వస్తువులలో ఇంకా అనేక రకాల వస్తువులపై ధరలు తగ్గుతాయని దాని వలన మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా దేశ ప్రజలు విదేశీ వస్తువుల వాడకం తగ్గించి స్వదేశీ వస్తువులు వాడడం వలన దేశ సంపద దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, జిఎస్టి జిల్లా కన్వీనర్ ఏల చంద్రశేఖర్, మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కాదురి అచ్చయ్య ,చందా మహేందర్ , స్థానిక వ్యాపారస్తులు మంచాల ఋషికేశ్ , వినోద్ ట్రేడర్స్ పసుపునూరి మనోహర్, కస్తూరి వెంకన్న, చింత రవీందర్, గడ్డం శ్రీనివాస్, స్థానిక కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ బుడుమ సంతోష్, పెద్ది శేఖర్, శ్యామ్ గటాని, పులిగిల్ల నాగరాజు, బచ్చు శ్రవణ్, జిల్లా కార్యదర్శిలు తడిసిన మల్లారెడ్డి, వైజయంతి మేడి కోటేష్ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, జిల్లా మీడియా కన్వీనర్ రామకృష్ణ , సీనియర్ నాయకులు పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు