23-09-2025 12:36:12 AM
డీఎంహెచ్‌వో శ్రీనివాసులు
గోపాలపేట సెప్టెంబర్ 22: మండలంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్య సేవలను నియమించుకోవాలని డిఎo హెచ్ ఓ అన్నారు. సోమవారం గోపాలపేట మం డల కేంద్రంలోని ఆరోగ్య కేం ద్రంలో బి స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భా గంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి ఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
పిల్లల వద్యురాలు డాక్టర్. శ్రావణి 61 చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు జరుపగా అందులో 44 మంది పిల్లలకు తక్కువ బరువుతో పోషక ఆహార లోపముతో ఉన్నట్లు గుర్తించి వారికి సరియైన మందులు ఇవ్వడం జరిగింది, అదేవిదంగా తల్లులకు పోషక ఆహారం గురించి తెలియజేశారు. మిగతాపిల్లలకు కూడా పరీక్షలు చేయడం జరి గిం ది.అదేవిదంగా 24న ఆఫ్తాళమి వైద్యులచే నేత్ర పరీక్షలు,
26న అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులు పరీక్షలు, 29న చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్యులు పరీక్షలు, అక్టోబర్ 1న పళ్లకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించబడుననిఈ ఇవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి తెలియ చేశారూ. ఈకార్యక్రమం లో డాక్టర్ చాంద్ పాషా, . సిబ్బంది సిద్ధాగౌడ్ సూపర్వైజర్లు సూచిత్ర, కౌసల్య, వెంకటమ్మ, మధుబాబు, భాగ్య పాల్గొన్నారు.