calender_icon.png 23 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సేపక్ తక్రా క్రీడా పోటీలు

23-09-2025 12:34:18 AM

  1. పురుషుల విభాగంలో విన్నర్‌గా హైదరాబాద్ 

బాలికల విభాగంలో విన్నర్‌గా నిజామాబాద్ 

బహుమతులు ప్రదానం చేసిన డీఎస్పీ వెంకటేశ్వరరావు 

వనపర్తి, సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 21 న ప్రారంభమైన 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా క్రీడా పోటీలు సోమవారం తో ముగిశాయి. రెండు రోజులపాటు ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ పోటీలకు తెలంగాణలోని గతంలో ఉన్న ఉమ్మడి పది జిల్లాల నుంచి పురుషుల విభాగం నుంచి పది జట్లు బా లికల విభాగం నుంచి 10 జట్లు ఈ పోటీలో పాల్గొన్నట్లు సెపక్తక్రా క్రీడా పోటీల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిర్వాహకులు బండారు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

రెండు రోజులపాటు జరిగిన ఈ సెపక్ తక్రా పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు రన్నర్ గా నిలువగా విన్నర్ గా ఆదిలాబాద్ క్రీడాకారులు తమ ప్రతిభను కనపర్చినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అదే విధంగా బాలికల విభాగంలో రన్నర్ గా నిజామాబాద్ బాలికలు మొదటి స్థానం సాధించగా విన్నర్ గా హైదరాబాద్ బాలికల జట్టు నిలిచిందని తెలిపారు.

ఈ క్రీడా పోటీల్లో రన్నర్ విన్నర్ గా గెలుపొందిన పురుషులు బాలికల జట్టు కెప్టెన్ లతోపాటు క్రీడాకారులకు ప్రధమ ధృతీయ బహుమతులను వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు , సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సెపక్తక్రా క్రీడా పోటీల నిర్వాహకులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మార్కెట్ క మిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోటీలు ముగిశాయి.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు తో పాటు సిఐ కృష్ణ, జిల్లా యూత్ స్పోరట్స్ అధికారి సుధీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాపర్ల రామ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాహుల్, వెంకట్రాం రెడ్డి, దొంత అశోక్ శెట్టి, తో పాటు క్రీడాకారులు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.