calender_icon.png 1 August, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

01-08-2025 12:22:05 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, జూలై 31 : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో అదన కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో వర్షాల కారణంగా ప్రజలకు సమస్యలు తలెత్తే పెద్దపెద్ద నాళాలు డ్రైనేజీలు గుర్తించాలని, వాటిని బాగు చేయించేందుకు ప్రణాళికలతో నివేదిక పంపాలని ఆదేశించారు.

మరీ ముఖ్యంగా జనావాసాలకు ఇబ్బందులు కలిగించే పెద్ద పెద్ద డ్రైనేజీలకు సంబంధించిన జాబితా సిద్ధం చేసి బాగు చేయించే ప్రణాళికలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, గణేష్, శశి ధర్, ఇతర మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.