20-10-2025 12:08:44 AM
ఎల్లారెడ్డి ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్
ఎల్లారెడ్డి అక్టోబర్19 (విజయ క్రాంతి): దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి ఆదేశానుసారం లైసెన్స్ ఉన్న దుకాణాల నుండి ప్రజలు బాణాసంచా కొనుగోలు చేయాలని బాణాసంచాను ప్రజలు పిల్లలు జాగ్రత్తగా కాల్చాలని ఎల్లారెడ్డి ఫైర్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. బాణాసంచెను బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాల్చాలని ఇరుకు ప్రదేశాలలో బానసంచెను పీల్చడం చిన్నచిన్న సందులలో పిల్లకు దగ్గరలో టపాసులు కాల్చి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు.
ఎల్లారెడ్డి ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్ దీపావళి పండుగ సందర్భంగా ఎల్లారెడ్డి ప్రజలకు ఆదివారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న దుకాణాల నుండి మాత్రమే బానిసంచా కొనుగోలు చేయాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో 12 దుకాణాలకు అనుమతులు పొందారని నాగిరెడ్డిపేట మండలంలో నాలుగు దుకాణాలకు బాణాసంచా విక్రయం దుకాణాలు అనుమతి పొందారని, తెలిపారు.
బాణాసంచాను కాల్చేటప్పుడు పసిపిల్లలను దూరంగా ఉంచాలని బాణాసంచాలను కాల్చేటప్పుడు ప్యాకింగ్ పై ఉన్న సూచనలను హెచ్చరికలను తప్పక పాటించాలని, బాణాసంచాలను బహిరంగ ప్రదేశాలను కాల్చాలని ఆట స్థలాలు లేదా మైదానాలు ఎంచుకొని కాల్చడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. అలాగే పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులు తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదని తెలిపారు.
రద్దీగా ఉండే ప్రదేశంలో ఇరుకు ప్రాంతాల్లో చిన్న చిన్న సందులలో ఇళ్లకు దగ్గరలో టపాసులు పేల్చవద్దని పెద్దల తోడు లేకుండా పసి పిల్లలకు బాణాసంచా కాల్చనివద్దన్నారు. బాణసంచాకు సంబంధించినటువంటి ఏ వస్తువులు జేబులో పెట్టుకోవద్దని ఎటువంటి బానసంచా అయినా చేతిలో పట్టుకొని కాల్చారాదాని తెలిపారు.
బాణ సంచాలు కాల్చేటప్పుడు పాదరక్షకులు ధరించాలని బానసంచ కాల్చేటప్పుడు పక్కన నీటి తొట్టి ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఎట్టి పరిస్థితులను ఇంటి లోపల బాణ సంచాలను కాంచన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేందర్,భరత్, పరుశురాం,బాలరాజ్,తుకారం,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.