calender_icon.png 31 August, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కత్తితో మెడ కోసి గర్భిణి హత్య

31-08-2025 12:31:27 AM

కరీంనగర్ జిల్లా టేకుర్తిలో దారుణం

ఇల్లందకుంట, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఏడు నెలల గర్భిణిని మెడ కోసి దారుణం గా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములుకి ఇద్ద రు భార్యలు ఉన్నారు. చిగురు మామిడి మం డలంలోని బొమ్మనపల్లి గ్రామానికి ముద్రబోయిన తిరుమల(29)ను ఏడు సంవత్సరాల క్రితం రాములు రెండో వివాహం చేసుకున్నా డు. అప్పటి నుంచి మొదటి భార్య, ఆమె ఇద్ద రు కొడుకులు..

రాములు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండో భార్య తిరుమల పేరుపై అదే గ్రామంలో రాములు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. మృతురాలు ఏడు నెలల గర్భిణి కావడంతో పుట్టబో యే బిడ్డ పేరున ఆస్తిలో వాటా అడుగుతుందన్న భయంతో గొడవ జరిగినట్టు తెలిసింది.

ఈ గొడవ ముదిరి చివరికి హత్య కు దారి తీసినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. మొదటి భార్య చిన్న కుమారుడు బన్నీతేజ.. తిరుమల మెడను కత్తితో కోసి ఈ హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. ఘటన స్థలానికి రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సు క్రాంతికుమార్ చేరుకొని విచా రణ చేపట్టారు.