calender_icon.png 29 August, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

29-08-2025 05:35:56 AM

  1. సీఎస్‌ను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
  2. వరద పరిస్థితులపై మెదక్‌లో సమీక్ష
  3. కామారెడ్డి జిల్లాలో ఏరియల్ సర్వే

మెదక్/కామారెడ్డి(విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కా మారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన ప్రాం తాలను సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వా రా ఏరియల్ సర్వే నిర్వహించారు.

మెదక్‌తోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌లో ముంపు  ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీక్షించారు. పోచారం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులను వీక్షించిన అనంతరం మెదక్ వెళ్లారు. గురువారం సాయంత్రం మెదక్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో భారీ వర్షాలు, వరదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రకృతి విపత్తులు విపత్తులు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉండి ఎటువంటి ఆస్తినష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఫోన్‌లో ఆదేశించారు. పలు జిల్లా ల్లో భారీగా వర్షాలు, వరదలు ముంచెత్తుతు న్న కారణంగా వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట నష్టా న్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ వీడియో క్యాప్చర్ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరచాలని అధికారులకు సూచించారు. వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు  తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

ముందస్తు కొనుగోలుతో యూరియా కొరత

రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్ప టి నుంచే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని, నానో యూరియాపై రైతులకు అవగాహన పెంపొందించా లని సీఎం రేవంత్ సూచించారు. చివరగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు.

ప్రాథమిక నివేదికను సమర్పించండి: సీఎస్

హైదరాబాద్(విజయక్రాంతి): రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ర్టంలో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవలన జరిగిన నష్టాలపై వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాలు అధికంగా నష్టాన్ని చవి చూశాయని, వీటితో పాటు ఇతర జిల్లాల్లో  కూడా గణనీయమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఈ ప్రాథమిక నివేదికలతో పాటు జరిగిన నష్టాలను తెలియచేసే ఫోటోలు, వీడియో క్లిప్పింగులు, పత్రిక క్లిప్పింగులు కూడా జతపర్చాలని పేర్కొన్నారు.

వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత జిల్లా కలెక్టర్లు నష్టాలపై పంపిన ఈ ప్రాథమిక నివేదికలను సంకలనం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖకు సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలని ఆదేశించారు. వరదల్లో చిక్కుకుని మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా అందజేయాలన్నారు.