calender_icon.png 15 November, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మను భాకర్‌కు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము

28-07-2024 05:07:02 PM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం అభినందించారు. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించడంతో, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచింది. మను భాకర్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కు తొలి పతకం గెలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మర్ము స్పందిస్తూ మను భాకర్‌ను భారతదేశం గర్వపడుతుందన్నారు. మను ప్రదర్శన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మను భాకర్‌ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాష్ట్రపతి పేర్కొన్నారు.