22-11-2025 02:08:08 AM
బూర్గంపాడు,నవంబర్ 21(విజయక్రాంతి):ఇసుక అక్రమ రవాణాకు రెవెన్యూ, పోలీసు అధికారులు చెక్ పెట్టారు. బూర్గంపాడు మండలంలోని గొమ్మూరు ర్యాంపు, సారపాక బ్రిడ్జి ప్రాంతంలో గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుపుతున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ అధికా రులు శుక్రవారం జేసీబీతో కందకాలు త వ్వించారు. కందకాలు పూడ్చి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కేఆర్ కెవి ప్రసాద్,ఎస్‌ఐ మేడ ప్రసాద్,అదనపు ఎస్‌ఐ నాగభిక్షం,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.