24-01-2026 12:26:33 AM
కరీంనగర్, జనవరి 23 (విజయక్రాంతి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు వైఖరికి నిరసనగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగా రు. ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం కొండగట్టులో టీడీపీ నాయకు లు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ద్వారా ఫోన్ చేయించుకొని లోకేష్ పేరు మీద అర్చనలు చేయించుకున్నారు.
దీంతో ఆలయ ఈవో అర్చకులను మందలించడమే కాకుండా మీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అర్చకులకు, ఈవోకు మధ్య వివాదం చెలరేగింది. అర్చకులు రాజాగోపురం ముందు నిరస నకు దిగారు. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, అర్చకులను జిల్లా స్థాయి అధికా రులను సైతం దుర్భాషలాడుతున్నట్టు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి.
ఈవో తీరు కారణంగా తమకు, ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు అర్చకులు తెలిపారు. ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా అర్చకుల నిరసన కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మో హరించి భద్రత కట్టు దిట్టం చేశారు.