24-01-2026 12:25:54 AM
కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,జనవరి23(విజయక్రాంతి):మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత,అంకితభావంతో పనిచేసి,మేడారం జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్‌ఆర్ గార్డెన్ లో మేడారం శ్రీసమ్మక్కసారలమ్మ మహా జాతర 2026విధులకు కేటాయించబడిన సెక్టోరల్ అధికారులు,సిబ్బందికి రెండవ విడత శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జాతరలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణా నేటితో ముగిసింది అని అధికారులు జాతర విధులలో పాల్గొనడానికి సిద్దంగా ఉండాలి అని అన్నారు. జాతర విజయవంతానికి అధికారులు కృషి చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని తెలిపారు జంపన్నవాగు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏ మాత్రం విధులలో ఏమరుపాటుగా వ్యవహరించరాదని తెలిపారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్&బి శాఖవారు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
జన సముహంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం 24గంటలు చేయాలన్నారు. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్ తో శుభ్రం చేస్తుండాలన్నారు. జాతర చుట్టూ 5 కి.మీ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని,పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫాం,గ్లౌజ్ లు,మాస్కులు ఇవ్వాలన్నారు అన్ని పను లు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
ఆరోగ్య పరంగా మందులు అందుబాటులో పెట్టుకొని సర్వసన్నద్దంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఆలయ అలంకరణ,లైటింగ్,పరిసరాలు గిరిజన సంస్కృతి,సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలని అన్నారు. ఇంజనీరింగ్,పారిశుద్ధ్య సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలన్నారు శాఖలవారు సెక్టార్లను అంతర్గతంగా విభ జించి,సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు అప్పజెప్పాలన్నారు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేయాలని అన్నారు.
జాతరలో పేపర్,క్లాత్,జూట్ సంచులను వాడాలన్నారు. గద్దెల వద్ద విధులు నిర్వ ర్తించే వారు సహనం కోల్పోకుండా భక్తులకు సేవాలందించాలన్నారు. జాతర నిర్వహణ ప్రతిసారి ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని,గతం కంటే మెరుగైన సేవలు అందించాలని,సెక్టార్ అధి కారులది జాతర నిర్వహణలో కీలకమైన పాత్ర అని,నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.