06-11-2025 01:34:00 AM
మంచిర్యాల, నవంబర్ 5 (మంచిర్యాల): నాలుగేండ్లుగా ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) ఆధ్వర్యంలో కళాశాలలు బంద్ చేసి చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారం సైతం కొనసాగా యి. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మాట్లాడుతూ మా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సివి రామన్ డిగ్రీ కళా శాల కరస్పాండెంట్ గడిపల్లి నర్సయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్ వి రమణ, మిమ్స్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, డైరెక్టర్ శ్రీధర్, వివేకవర్ధిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ , శ్రీ హర్ష డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్‌రెడ్డి, వాగ్దేవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ రాజు పాల్గొన్నారు.