06-11-2025 01:32:50 AM
మందమర్రి, నవంబర్ 5: సనాతన ధర్మా న్ని పాటిస్తూ, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత వైపు నడుస్తూ, భక్తి భావాన్ని పెంపొందించుకో వాలని పట్టణ ఎస్‌ఐ ఎస్ రాజశేఖర్, పంచ ముఖి హనుమాన్ ఆలయ పూజారి డింగరి కృష్ణ చైతన్య ఆచార్యులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు లు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని పంచముఖి హను మాన్ ఆలయం నుండి బెల్లంపల్లి మండలం లోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు చేపట్టిన మహా పాదయాత్ర ప్రారం భోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజ రై, పాదయాత్రను ప్రారంభించారు.
ముం దుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు భారతీయ సంస్కృతి సం ప్రదాయాలను గౌరవిస్తూ, సనాతన ధర్మాన్ని ఆచరించాలని కోరారు. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున పాదయాత్రగా ఆ మహాశివుని కొలిచేందుకు తరలి వెళ్లడం శుభప్రదమని ఆన్నారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేసి, పాదయాత్ర భక్తులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మహా పాదయాత్ర నిర్వాహకులు రామటెంకి దుర్గరాజ్, చెలిమేటి చంద్రమౌళి, కొలేటి శివప్రసాద్, కొంతo రాజు, భక్తులు పాల్గొన్నారు.