calender_icon.png 4 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు

03-11-2025 07:18:59 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తేదీ రాత్రి 9.45 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (40) మైసమ్మగుట్ట వందన హోటల్ ఎదురుగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి రోడ్డును దాటుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తికి తలకి గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ సహాయంతో అతడిని నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే ఘట్ కేసర్ పోలీసు వారికి తెలియజేయాలన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8712662705, 8712662183.