calender_icon.png 4 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

03-11-2025 07:16:17 PM

రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మదన్ మోహన్, పొలాల్లో పనిచేస్తున్న, రైతుల, వద్దకు నేరుగా వడ్ల పొలాల్లో రైతులు పడుతున్న కృషిని చూసి మహిళా రైతులతో మాట్లాడారు. అనంతరం రైతులు మొన్నటి వర్షాల వల్ల ధాన్యం తడిసిందని, కలిసిన ధాన్యం పట్ల వరి పంట పొలంలో ఉన్న రైతుల పట్ల, ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.

దీనిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందిస్తూ రైతులు ఎవ్వరు అధైర్యపడొద్దు, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది” అని రైతాంగానికి భరోసా ఇచ్చారు. అలాగే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని వ్యక్తిగతంగా కలిసి, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు కష్టపడి పండించిన పంటకు న్యాయం జరిగే వరకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా గౌడ్ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి లింగంపేట్ మాజీ జెడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షులు బొండ్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.