calender_icon.png 4 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి ఆస్తి రెండెకరాలు మోసం చేసి కాజేసిన తనయుడు..

03-11-2025 07:16:47 PM

లబోదిగోమని బోరుమని వెలిపిస్తున్న తండ్రి వెంకట్రామయ్య..

కోదాడ: తండ్రి ఆస్తి రెండెకరాలు రైతుబంధు కోసమని తాసిల్దార్ కార్యాలయానికి తీసుకొని వెళ్లి రెండు ఎకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన అనంతగిరి మండలం లకారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మాకు మాయమాటలు చెప్పి మా చదువు రాని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మా చిన్న కుమారుడు మా భూమిని తన పేరు పైకి గిఫ్ట్ రిజిస్టర్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అనంతగిరి మండలం లక్కవరం గ్రామానికి చెందిన బాడిస వెంకట్రామయ్య ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారని, ఇద్దరు కుమారులకు సమానంగా పంచినట్లుగా తెలిపారు. మిగిలిన 2.1150 కుంటల భూమి నా పేరుపై, నా భార్య పేరుపై ఉన్నదని అదే మాకు జీవన ఆధారమని తెలిపారు.

నా అమాయకత్వాన్ని చదువులేని తనాన్ని ఆసరాగా తీసుకొని నా చిన్న కుమారుడు మోసం చేసి రైతుబంధు డబ్బులు గురించి అని ఎమ్మార్వో కార్యాలయంకు నన్ను నా భార్యను తీసుకువెళ్లి కాగితాలపై సంతకాలు పెట్టించి దొంగతనంగా తన పేరు మీద నా భూమిని తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. భూమికి సంబంధించిన ఒరిజినల్ పాస్  పుస్తకాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అర్థం కావటం లేదన్నారు. తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ అయిందని తెలిసినా భార్య మనోవేదనకు గురై గుండెనొప్పితో మరణించినట్లుగా తెలిపారు. ఎందుకిలా చేసావని మా చిన్న కుమారుడిని ప్రశ్నించిన ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని వారు పేర్కొన్నారు. దయచేసి అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ ఆయన వేడుకున్నారు. ఇదే విషయమై సంబంధిత అధికారులను వివరణ అడగగా ప్రభుత్వ నిబంధన ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని వారు అభ్యంతరం తెలిపిన వెంటనే హోల్డ్ లో పెట్టామని తెలిపారు.