08-10-2025 12:11:13 AM
ఎంపీ ఈటల రాజేందర్‌కు రజక సంఘం నాయకుల వినతి
ఎల్బీనగర్, అక్టోబర్ 7 : నాగోల్ డివిజన్ లోని దోబీఘాట్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను రజక సంఘం నాయకులు కోరారు. మంగళవారం ఉదయం ఎంపీ ఈటల రాజేందర్ ని శామీర్ పేట్ లో ఆయన నివాసంలో నాగోల్ డివిజన్ రజక సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. దోబీఘాట్ లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, మౌలిక వసతులు పూర్తిచేయాలని కోరారు.
అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్ పూర్తి చేయాలని, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, బాత్ రూమ్ గదులు, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బి.చుక్కయ్య, బి.కృష్ణ, బి.మధు, బి.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.