calender_icon.png 16 July, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి

15-07-2025 05:27:05 PM

సీడీపీఓ స్వరూప కి అంగన్వాడిల వినతి

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్లు,  ప్రమోషన్యూ,రిటైర్మెంట్, టీచర్లు ఆయాలకు బెనిఫిట్స్ వంటి ప్రధాన సమస్యలను వెంటనే చెల్లించాలనీ సీఐటీయూ నాయకులు డిమాండ్ శారు. మంగళవారం బెల్లంపల్లి ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూపకి అంగన్వాడి యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతి అందజేశారు. బెల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోఉన్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భానుమతి, రాజమణి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని అనేక హామీలు ఇచ్చిందనీ గుర్తు చేశారు.

కానీ వాటిని మాత్రం అమలు చేయలేదనీ దుయ్యబట్టారు. వయసు పైబడిన వాళ్లను రిటైర్మెంట్ చేసిందనీ, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం ఇంకా చెల్లించలేదనీ విమర్శించారు.. ఇప్పటికీ సంవత్సరం గడిచిన  రిటర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో  అంగన్వాడి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో ప్రకారం ఇంటి అద్దెలు చెల్లించాలన్నరన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు, పాలు మిగతా వస్తువులు నాణ్యమైనవి సరఫరా చేయాలన్నారు.జీపీఎస్ ద్వారా ఫోటోలు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు, అలాగే  ఫోటో క్యాప్చర్ ను తీసివేయాలన్నారు.

పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దె బిల్లులు ఇతర బిల్లులన్నీ వెంటనే చెల్లించాలనీ కోరారు. క్వాలిటీ యూనిఫామ్ లు,  రిజిస్టర్లు ఐసీడీఏస్ ద్వారా ప్రింట్ చేసి ఇవ్వాన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం  ఐసీడీఎస్ కు ప్రతి యేటా బడ్జెట్ ను తగ్గిస్తుందనీ విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడి కేంద్రాలను ఎత్తివేసే కుట్ర బీజేపీ మానుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.