calender_icon.png 21 November, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం దృష్టికి సోయా రైతుల సమస్యలు

21-11-2025 12:45:42 AM

సీఎం రేవంత్‌తో కలిసి కేంద్ర మంత్రికి జిల్లా బీజేపీ ఎమ్మెల్యేల వినతి

ఆదిలాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి వర్షాల వల్ల  సోయా పంట పూర్తిగా రంగు మారడంతో కేంద్ర సంస్థలు కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే లు కేంద్ర వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రిని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి రైతుల పక్షాన వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర సంస్థలు రంగుమారిన సోయా పంటను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సహజ విపత్తు రైతుల నియంత్రణలో లేని విషయం కాగా, చిన్న, సన్న కారు రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో రైతులకు ఇతర జీవనోపాధి మార్గాలు లేని పరిస్థితిని వివరించారు. ఈ సీజన్కు మాత్రమే నిబంధనల్లో ప్రత్యేక సడలింపు ఇచ్చి, రంగు మారిన సోయాను వెంటనే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరా రు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఈ అం శాన్ని అవగాహన చేసుకుని, రైతుల బాధను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించారనీ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ పేర్కొన్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన సడలింపు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. రైతు బాధలు తీర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం మని, ఆదిలాబాద్ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాం అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారన్నారు. ఈ సానుకూల స్పందనతో ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు భారీ ఉపశమనం పొందనుందన్నారు. దీంతో రైతులు పక్షాన కేంద్ర మంత్రి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.