calender_icon.png 21 November, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీ నియామకం హర్షణీయం

16-08-2024 08:51:34 PM

హుజురాబాద్:  ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా నియమించినందుకు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి వర్గానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 

గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా, గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ, గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నదని ముక్కెర రాజు పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు, విద్యావ్యవస్థ పటిష్టపరిచేందుకు కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకుని విద్యాశాఖను కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.