calender_icon.png 17 May, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల రక్షణ అందరి బాధ్యత

17-05-2025 05:42:15 PM

పిల్లల హక్కులు, చట్టాలపై అందరికి అవగాహన ఉండాలి..

కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కేంద్రంగా జిల్లా పరిపాలన అధికారి పమెల సత్పతి(District Administrative Officer Pamela Satpathy) సారధ్యంలో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్, సఖీ సెంటర్ అడ్మిన్ లక్ష్మి పాల్గొని బాలికల భద్రత, లింగ సమానత్వం, పిల్లల అక్రమ రవాణా గురించి అవగాహన కలిపించి ఉపాధ్యాయుల పాత్ర, పిల్లలలో తీసుకురావాల్సిన మార్పు గురించి చర్చించారు. పోక్సో చట్టం(POCSO Act) 2012, బాల్య వివాహ నిరోధక చట్టం 2006, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 పై శిక్షణ కలిపించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్ లైన్ 181 ఏ విదంగా ఉపయోగించుకోవాలో అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మండల విద్యాధికారులు ఆనందం, రిసోర్స్ పర్సన్స్, ప్రభుత్వ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.