29-01-2026 01:16:47 AM
అలుమ్నీ నేతృత్వంలో దేశంలోనే అతిపెద్ద విద్యార్థుల వసతి గృహం
హైదరాబాద్, జనవరి 28: ఐఐటీ బాం బేలో అలుమ్నీల ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఎవర్‌గ్రీన్’ పూర్తయ్యి పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి వచ్చింది. రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతిపెద్ద అలుమ్నీ నేతృత్వంలోని విద్యార్థుల వసతి గృహాల ప్రాజెక్ట్‌గా గుర్తిం పు పొందింది. మొత్తం 3,70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో 848 గదులు, 1,127 పడకలు ఉ న్నాయి. ఇది ఐఐటీ బాంబే చరిత్రలోనే అతిపెద్ద విద్యార్థుల హాస్టల్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.
ఈ భవనాలకు ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ రేటిం గ్ సిస్టమ్ కింద గోల్ సర్టిఫికేషన్ లభించగా, ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఈ గుర్తింపు పొం దిన తొలి భవనాలుగా ఇవి నిలిచాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురితో జరిగిన చర్చల ద్వారా జరిగినట్లు ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. అలుమ్నీ నేతలు నారాయణ్ సుందరేశన్ (నిర్మాణ బాధ్యతలు), కిరాట్ పటేల్ (నిధుల సమీకరణ) ఈ ప్రాజెక్ట్ను ముందుండి నడిపించారు.
ఈ కార్యక్రమానికి 1962 బ్యా చ్ నుంచి 2024 బ్యాచ్ వరకు చెందిన 2,700కిపైగా అలుమ్నీలు విరాళాలు అందించగా, దాదాపు 100 మం ది అలుమ్నీ వాలంటీర్లు తమ సేవలను అం దించారు. విరాళాల పరిమాణం 10 కోట్ల నుంచి 1,000 వరకు ఉంది. ఒక ప్రస్తుత విద్యార్థి ఇచ్చిన రూ.100 విరాళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కెదారే మా ట్లాడుతూ, అలుమ్నీలుసంస్థల సమన్వయంతో ఇలాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతా యని పేర్కొన్నారు. విద్యార్థుల వసతి సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, ఉన్నత విద్యా రంగంలో ప్రజాప్రైవేట్ భాగస్వామ్యానికి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంద ని ఆయ న తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి 25కిపైగా కార్పొరేట్ సంస్థలు మద్దతు అందించాయి.