calender_icon.png 29 January, 2026 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి రహిత పాలన సాగిస్తాం

29-01-2026 01:19:06 AM

టీఆర్పీ కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి రజనీకుమార్

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బీ ఫామ్‌లు ఇస్తాం

పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్

మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఉమ్మడి నల్లగొండ ఇన్‌చార్జి జానయ్య

బీసీలకు కాంగ్రెస్ మోసం 

మేడ్చల్ టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్‌గౌడ్

కరీంనగర్/పెద్దపల్లి/మెదక్/సూర్యాపేట/ మేడ్చల్, జనవరి 28(విజయక్రాంతి): ము న్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రక టించింది ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోను ఎన్నికల మ్యా నిఫెస్టో టీఆర్పీ నాయకులు విడుదల చేశా రు. ఈ సందర్భంగా పార్టీ ఆశయాలను, పురపాలక సంఘాల్లో తమ పార్టీ గెలిస్తే చేపట్టబోయే పనులను వివరించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో టీఆర్పీ జిల్లా ఇన్‌చార్జి మాదం రజనీకుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే, అవినీతిరహిత పాలన దిశగా స్పష్టమైన కార్యాచ రణతో మ్యానిఫెస్టో సిద్ధం చేశామని అన్నారు.

మున్సిపాలిటీల్లో ప్రజల భాగస్వామ్యం తో పాలన సాగించే విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షులు గంగిపెల్లి అరుణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ వాజిత్, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ ఆర్షత్ బిన్ అలీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ కుమార్ బీసీల రాజ్యం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆశావహులకు తమ పార్టీ బీ ఫామ్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉం దని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గం, మండల నాయకులు పాల్గొన్నారు.

మెదక్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలే అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో బలంగా పోటీ చేస్తామన్నారు. జిల్లా, మండల నాయకత్వంతో కలిసి పార్టీ వ్యూహాలు ప్రకటిస్తూ ప్రజల సమస్యలపై పోరాటానికి సిద్ధమని నే తలు వెల్లడించారు.సూర్యాపేటలోని టీఆ ర్పీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కార్య క్రమంలో పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజు ల తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ హరిశంకర్‌గౌడ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మేడ్చల్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ ఎన్నిక ల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణిగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజుపటేల్ తదితరులు పాల్గొన్నారు.