calender_icon.png 25 August, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్‌కోలో అకౌంట్స్ ఆఫీసర్లకు పదోన్నతులు

22-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జెన్‌కోలో కోర్టు కేసుల కారణంగా సుదీర్ఘకాలంంగా పెండింగులో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి ఏకకాలంలో 62 మంది  అకౌంట్స్ అధికారులకు పదోన్నతులు లభించడంపై విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చే సింది. ఈ సందర్భంగా విద్యుత్‌సౌధలో శనివారం అసోసియేషన్, పదో న్నతులు పొందిన ఉద్యోగులు సమావేశమై తమ సంతోషాన్ని వ్యక్తం చేశా రు. సమావేశంలో వీఏఓఏటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ పదోన్నతుల సమస్యను పరి ష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్తు శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రొనాల్డ్ రోస్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల పదోన్నతికి చొరవ చూపిన డైరెక్టర్ అజయ్, ఫైనాన్స్ డైరెక్టర్ అనురాధకు కృతజ్ఞతలు తెలిపారు.