02-08-2025 10:55:51 PM
కాలేశ్వరం నిర్మించిన రెండేళ్లకే పగుళ్లు
కాంగ్రెస్ హాయంలో నిర్మించిన ప్రాజెక్టు 100 సంవత్సరాలైనా చెక్కుచెదడం లేదు
అక్రమాలకు పాల్పడిన వాడు శిక్ష తప్పదు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, షబ్బీర్ అలీ
కామారెడ్డి,(విజయక్రాంతి): కేసీఆర్ కు జైలుకు కూడు తప్పదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరులో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు వంద సంవత్సరాలు అవుతున్న చెక్కుచెదరలేదని అన్నారు. కెసిఆర్ నిర్మించిన కాలేశ్వరం రెండు సంవత్సరాలకే బీట లు వారాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకుండా కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన సిఎం కెసిఆర్ కు జైలు శిక్ష తప్పదని అన్నారు. రేషన్ కార్డుల కోసం పేదలు 10 సంవత్సరాలుగా నిరీక్షించారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతే పేదలకు రేషన్ కార్డు లు వస్తున్నాయని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన పేదలకు ఒక్క రేషన్ కార్డు పంపినీ చేయ లేదన్నారు. గత ప్రభుత్వం పేదల కోసం పనిచేయలేదు అన్నారు. గత పాలకులు తమ స్వార్థం కోసం పనిచేశారని అన్నారు. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పేదలకు సన్న బియ్యం అందించారన్నారు. పేదలు సన్న బియ్యం తినాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని అమలు చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని నిరుపేదలు నిర్మి ంచుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ హయాంలో సంతోషంగా ఉన్నారని అన్నారు.