24-05-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, మే 23: వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ నల్ల పొచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ శ్రీ నల్ల పొచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
తెల్లవారుజామున మండప పూజలు, హోమాలు, అగస్యసంగర్తనాసం రత్న న్యాసం, బోజన్యాసం, ధాతున్యాసం, ఉదయం 7.36 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ఉదయం 9 గంటలకు కళాణ్యాసం, నేత్రమేళనం, 10 గంటలకు బలిప్రధానం, ధేను దర్శశనం జయ్యాదిహోమం, పూర్ణాహుతి, 11 గంటలకు కుంభాభిషేకం, బ్రహ్మణ ఆశీర్వచనం, హారతి, మంత్రపుష్వ తీర్థప్రసాద వినియోగం, మహా అన్నతర్పణం, 12 గంటలకు మహా అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం బోనాలను మహిళలు తీసుకువచ్చి అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ వాయిద్యాలు, యువతియువకుల కేరింత మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్టపన మహోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ నిర్వహకులు భారీ ఏర్పాట్లు నిర్వహించారు.