08-05-2025 12:05:53 AM
మణికొండ, మే 7: తిరుమల హిల్స్ ప్రభుత్వ భూమిని రక్షించడానికి హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోవాలని ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు వంశీ, తిరుమల హిల్స్ అధ్యక్షుడు అవినా శ్‌లు కోరారు. బుధవారం తిరుమల హిల్స్ కార్యాలయం ఆవరణంలో వారు మాట్లాడుతూ.. 1994లో పంచాయతీకి తిరుమల కొండలోని సుమారు 6,000 చదరపు గజాల భూమిని గిఫ్ట్ డీడ్ ఇచ్చారన్నారు.
ఈ భూమిని కాపాడాలని ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ పరిధిలో ఉన్న అన్ని కాలనీలు, ఆర్డబ్ల్యూఏ సమాఖ్య ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సంప్రదించినట్లు తెలిపారు. ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు వంశీ, తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షుడు అవినాశ్, స్థానికులు భరత్, రంగనాథ్ చారి, శ్రీనివాస్ తదితరులు ఇచ్చిన ఫిర్యాదును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి, భూ రక్షణకు చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారి రాజశేఖర్ను ఆదేశించినట్లు తెలిపారు.
దీంతో రాజశేఖర్ తిరుమల హిల్స్ లోని స్థలాన్ని సందర్శించి, అనధికార నిర్మాణ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.