08-05-2025 12:07:02 AM
మునగాల, మే 7: సూర్యాపేట జిల్లా మునగాల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 18 సంవత్సరాలు లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని మునగాల మండల ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్ డ్రైవింగ్ నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా ధరించి వాహనాలు నడపాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్లయితే హెల్మెట్ ఉంటే స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.