17-05-2025 12:00:00 AM
నేరాలపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన
జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు
జహీరాబాద్, మే 16: జిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు మహిళలు, పిల్లలపై జరుగుతున్న పోక్సో, అత్యాచార కేసుల గురించి జహీరాబాద్ సబ్-డివిజన్ అంగన్ వాడీ టీచర్లకు శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి భరోసా నోడల్ అధికారి, అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు హాజరై మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల సేవలను ఒకే గొడుగు క్రింద అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పొక్సో, అత్యాచార కేసు నమోదు మొదలుకొని, భాదిత మహిళల సమస్యకు పరిష్కారం చూపే దిశగా వారి వెన్నంటి ఉంటూ, మెడికో, లీగల్ సేవలను అందిస్తూ భరోసా సిబ్బంది వారికి న్యాయం జరిగేవిధంగా కృషి చేయడం జరుగుతుంది అ న్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంభందిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
18 సంవత్సరాలలోపు బాల బాలికలపై జరిగే లైంగిక దాడులను పోక్సో కేసులుగా పరిగణించడం జరుగుతుందని, మహిళా సంభందిత నేరాలను అరికట్టడంలో జిల్లా పోలీసులకు సహకరించవలసిందిగా ఆయన సూ చించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ లలిత కుమారి, జహీరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ హను మంతు, డీసీపీఓ రత్నం, జహీరాబాద్ సబ్-డివిజన్ ఎస్‌ఐలు, చైల్ లైన్ కో-ఆర్డినేటర్ యాదగిరి, భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, భరోసా సిబ్బంది, సిడిపిఓలు, సుమారు 200 మంది అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.