17-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మే 16(విజయక్రాంతి): సమాజంతో భాగస్వామ్యమై డెంగ్యూ ను నివారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాల యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ల్యాబ్ టెక్ని టెక్నీషియన్స్ తో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుండి జాతీ య డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
డెంగ్యూ వ్యాధిపై జిల్లాలో ప్రజలను అప్ర మత్తం చేస్తూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించాలని తెలిపారు. డెంగ్యూ, ఇతర కీటక జనిత వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జూన్ నెల నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అను గుణంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు.
డెంగ్యూ లక్షణాలు ఉన్నటైతే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ వాల్ పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమములో జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీత, ఇం టర్మీడియట్ అధికారి మాధవి, డిప్యూటీ డీఎంహెచ్వోలు సృజన, జ్ఞానేశ్వర్, డి.సిహెచ్వోలు డాక్టర్ శివ దయాల్ జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.