calender_icon.png 30 January, 2026 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు అంటగట్టారని నిరసన

04-10-2024 12:00:00 AM

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నకిలీ వరి విత్తనాలు విక్రయించారని రైతులు ఓ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు. గురువారం తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతులు కొద్ది రోజుల క్రితం పట్టణంలోని సంకల్ప్ ఫర్టిలైజర్స్‌లో వరి విత్తనాలు కొనుగోలు చేశారు. శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలం టూ నాసిరకం విత్తనాలు అం టగట్టడంలో వరిలో  కాండం, పిలకల ఎదుగదల లోపించిందని ఆరోపించారు. వ్యవసాయశాఖాదికారులకు ఫిర్యాదు చేయడంతో వారు శాంపిళ్లను సేకరించి చర్యలు తీసుకుం టామని చెప్పడంతో శాంతించారు.