calender_icon.png 1 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ఆర్డీవోకు అదనపు కలెక్టర్‌గా పదోన్నతి

30-07-2025 12:59:12 AM

 వరంగల్, జులై 29 (విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రెవెన్యూ శాఖలో ఆర్డీవో లూగా విధులు నిర్వహిస్తున్న 44 మంది ఆర్డిఓ లకు అదనపు కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించినట్టు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి లభించినటువంటి ఆర్డీవోలలో వరంగల్ ఆర్డిఓ గా విధులు నిర్వహిస్తున్న సత్యపాల్ రెడ్డికి అదనపు కలెక్టర్గ పదోన్నతి లభించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ అధికారులు, మండల తాసిల్దరులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.