calender_icon.png 29 May, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ రంగా కార్మికులకు ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించండి

28-05-2025 07:54:56 AM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ రంగా ఉద్యోగులకు రూ. కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని టి ఆర్ వి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో, టీఎస్ ఎన్పీడీసీఎల్ నందు పని చేసే కార్మికుల,ఉద్యోగుల  ఆర్టిజన్స్ యొక్క వేతనాల ఎకౌంటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ నందు కొనసాగుతున్న అన్నారు.

వారిలో  విధి నిర్వహణలో  ప్రమాదవశాత్తు  ఉద్యోగి మరణించిన రూ1  కోటి  ఇన్సూరెన్స్ ను వర్తింప చేయాలని  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టి ఆర్  వి కే ఎస్ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, జెన్కో ఉపాధ్యక్షులు ధర్మపురి నాగేశ్వరరావు, జెన్కో అసిస్టెంట్ సెక్రటరీ ఎండి అమీన్, కేటీపీఎస్ 7 వ దశ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు దెంచనాల రాంబాబు,ముత్యాల రాంబాబు, రీజనల్  వర్కింగ్ ప్రెసిడెంట్ నారందాసు వెంకటేశ్వర్లు, కేటీపీఎస్ 5,6 దశల  రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కురిమెళ్ళ రవికుమార్ ,MD సుభాని  కోల్ ప్లాంట్ బ్రాంచ్ అధ్యక్షులు బుధార్తి మహేందర్ ,ఆర్టిజన్ నాయకులు అనిగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు