06-12-2025 12:14:48 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బెనిపిట్స్, పెన్షన్ , గ్రాట్యూటీ, లీవన్ ఎన్‌క్యాష్‌మెంట్, ఆరియర్లు , వైద్య బిల్లులు వంటి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం సచివాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. దాదాపు 13 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు ఉన్నాయని తెలి పారు. అంతకు ముందు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆ తర్వాత ఏడీ కార్యాలయం నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిర సన కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ సభ్యులు, సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్సన్ మా ట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులను వీధుల్లోకి తీసుకురావాల్సిన దుస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే గవర్నర్, సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీలకు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమన్నారు.